Dewald Brevis: సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ '300' | Dewald Brevis Creates History, Becomes Second Fastest Batter To Hit 300 T20 Sixes After Chris Gayle, Read Story For Details | Sakshi
Sakshi News home page

Dewald Brevis: సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ '300'

Oct 17 2026 4:09 PM | Updated on Oct 17 2026 4:22 PM

Dewald Brevis becomes the second fastest player in T20 history to reach 300 sixes

source: X

సౌతాఫ్రికా బ్యాటింగ్‌ చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 300 సిక్సర్ల మార్కును (150 ఇన్నింగ్స్‌) తాకిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌ (112 ఇన్నింగ్స్‌) పేరిట ఉంది. 

భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ 300 సిక్సర్ల రికార్డు అభిషేక్‌ శర్మ (163 ఇన్నింగ్స్‌లు) ఉంది. అభిషేక్‌ తర్వాతి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ (205 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్‌ 2026-27లో భాగంగా నాటల్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్‌ (టైటాన్స్‌) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 24 బంతుల్లో 2 సిక్సర్లు, బౌండరీ సాయంతో 33 పరుగులు చేశాడు. బ్రెవిస్‌తో పాటు ప్రిటోరియస్‌ (81) విధ్వంసం సృష్టించడంతో టైటాన్స్‌ నాటల్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇదిలా ఉంటే, టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా క్రిస్‌ గేల్‌ (1132) పేరిటే ఉంది. గేల్‌ తర్వాతి స్థానాల్లో పోలార్డ్‌ (1013), రసెల్‌ (809) ఉన్నారు. భారత్‌ తరఫున అత్యధిక టీ20 సిక్సర్ల రికార్డు రోహిత్‌ శర్మ (568) పేరిట ఉంది. అతడి తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లి (460) ఉన్నాడు.

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌ పర్యటన.. భారత జట్ల ఎంపికలో ఆసక్తికర విషయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement