T20 World Cup 2022: Rohit Sharma Drops Big Hint On Pacer Jasprit Bumrah Replacement - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రోహిత్‌ ఏమన్నాడంటే?

Oct 5 2022 10:39 AM | Updated on Oct 5 2022 3:30 PM

Rohit Sharma drops big hint on pacers replacement - Sakshi

ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. ఇక మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుం‍ది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌-2022కు టీమిం‍డియా ఆక్టోబర్‌ 6న ఆస్ట్రేలియాకు పయనం కానుంది. అదే విధంగా టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో అని అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. "మా ప్రధాన బౌలర్‌ బుమ్రా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. కాబట్టి ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న బౌలర్‌ మాకు కావాలి. ఆ బౌలర్ ఎవరనేది మాకు ఇంకా సృష్టత లేదు.

మేము ఆస్ట్రేలియాకు వెళ్లాక ఎంపిక చేసే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా బుమ్రా స్థానంలో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే షమీ మాత్రం తన ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. అతడు ఈ వారంలో నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది.
చదవండిIndia vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement