Rohit Sharma Buys 4 Acre Land for Around INR 9 Crore in Alibaug - Sakshi
Sakshi News home page

Rohit Sharma: గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి!

Dec 16 2021 1:23 PM | Updated on Dec 16 2021 5:48 PM

Rohit Sharma buys 4 Acre land for around INR 9 crore in Alibaug - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన భార్య రితికా సజ్దే ​​పేరిట అలీబాగ్‌లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పక్రియ మంగళవారం(డిసెంబర్‌-14)న అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరగినట్లు సమచారం. అలీబాగ్‌లో రోహిత్‌ ఒక్కడే కాకుండా, అంతకుముందు సచిన్ టెండుల్కర్,విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రి, అజిత్‌ అగర్కార్‌కు సంబంధించిన అస్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. అలీబాగ్ సిటీకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరళ్ మహత్రోలి అనే గ్రామంలో కొనుగోలు చేశాడు.

"ల్యాండ్‌ డీల్‌ కోసం రోహిత్ శర్మ మంగళవారం మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. కానీ అతడు భూమిని కొన్నాడా  లేదా అతడితో పాటు ఉన్న వ్యక్తి కొనుగోలు చేశాడా అన్నది మాకు తెలియదు" అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో అలీబాగ్‌ సబ్ రిజిస్టర్ సంజాన జాదవ్‌ పేర్కొన్నారు.

అదే విధంగా ఆ గ్రామ సర్పంచ్‌ మాట్లాడూతూ.."తన భార్య పేరిట 4ఎకరాల భూమిని రోహిత్‌ శర్మ కొనుగోలు చేశాడు. దాని విలువ సూమారు 9 కోట్లు ఉంటుంది.  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత మా గ్రామానికి వచ్చి ఆ స్ధలంలో పూజ కూడా నిర్వహించాడు" అని అతడు పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా దక్షిణాఫ్రితో టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్‌ చేస్తూ.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement