టీమిండియా దిగ్గజ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.
Rohit Sharma in his element 🙌
🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW— IndianPremierLeague (@IPL) March 29, 2026
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా అంపైర్‌తో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది.
గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా..
కేకేఆర్ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో.. అంపైర్ అతడి బ్యాట్‌ను పరీక్షించాడు. బ్యాట్ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్ తన బ్యాట్ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్ ఇచ్చాడు.
నేను ముందే చెప్పాను కదా!
అయితే, నిబంధన ప్రకారం బ్యాట్‌ను టెస్టు చేసిన అంపైర్ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్‌మ్యాన్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రోహిత్.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మది. కెప్టెన్ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?
— • (@ClassyCricket) March 30, 2026


