IPL 2023, PBKS Vs DC: Rilee Rossouw Terrific Batting Records Batting At Number 3 T20 Cricket - Sakshi
Sakshi News home page

#RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు

May 17 2023 10:15 PM | Updated on May 18 2023 10:22 AM

Rilee-Rossouw-Terrific Batting Records-Batting At-Number-3-T20 Cricket - Sakshi

photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిలీ రొసౌ తొలిసారి తన బ్యాటింగ్‌ పవరేంటో చూపించాడు. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లను చీల్చిచెండాడిన రొసౌ ఐపీఎల్‌లో తొలి అర్థశతకం సాధించాడు. కేవలం 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ధాటికి ఈ సీజన్‌లో ఢిల్లీ తొలిసారి 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. 

ఇక టి20 క్రికెట్‌లో రిలీ రొసౌకు మూడోస్థానం బాగా అచ్చొచ్చింది. నెంబర్‌-3లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి రొసౌ పరుగులు విధ్వంసం సృష్టించాడు. ఇప్పటివరకు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 109 ఇన్నింగ్స్‌లు ఆడి 3731 పరుగులు చేశాడు. 159.71 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన రొసౌ ఖతాలో ఐదు సెంచరీలు, 28 హాఫ్‌ సెంచరీలు ఉండడం విశేషం. ఇక టి20 క్రికెట్‌లో నెంబర్‌-3లో బ్యాటింగ్‌కు వచ్చి ఇన్ని శతకాలు, అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన బ్యాటర్లో రొసౌ మినహా ఒక్కరు లేకపోవడం గమనార్హం.

చదవండి: అరుదైన ఘనత.. కోహ్లి,రైనా, ధావన్‌ సరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement