
సాక్షి, విశాఖపట్నం: రేపటి నుంచి మొదలయ్యే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్ జట్టును ప్రకటించారు. రికీ భుయ్ సారథ్యంలో ఆంధ్ర జట్టు ఈ సీజన్‌లో పోటీపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు ఈనెల 15 నుంచి జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుతో కాన్పూర్‌లో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర, ఉత్తరప్రదేశ్‌లతోపాటు బరోడా, తమిళనాడు, నాగాలాండ్, ఒడిశా, విదర్భ, జార్ఖండ్ జట్లున్నాయి.
ఆంధ్ర రంజీ జట్టు
రికీ భుయ్ (కెప్టెన్, విశాఖపట్నం), కోన శ్రీకర్ భరత్ (విశాఖపట్నం), అభిషేక్ రెడ్డి (చిత్తూరు), షేక్ రషీద్ (గుంటూరు), కరణ్ షిండే (కర్నూలు), పీవీఎస్‌ఎన్ రాజు (తూర్పు గోదావరి), కేవీ శశికాంత్ (విశాఖపట్నం), సౌరభ్ కుమార్ (గెస్ట్ ప్లేయర్), వై.పృథ్వీరాజ్ (విజయనగరం), టి.విజయ్ (శ్రీకాకుళం), ఎస్.ఆశిష్ (విశాఖపట్నం), అశ్విన్ హెబ్బర్ (నెల్లూరు), రేవంత్ రెడ్డి (నెల్లూరు), కె.సాయితేజ (తూర్పు గోదావరి), చీపురపల్లి స్టీఫెన్ (తూర్పు గోదావరి), వై.సందీప్ (కృష్ణా).