చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 141 పరుగులకు ఢిల్లీ ఆలౌట్‌ | Renuka, Wareham Spark RCB Bowl out Delhi Capitals for 141 | Sakshi
Sakshi News home page

WPL 2025: చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 141 పరుగులకు ఢిల్లీ ఆలౌట్‌

Feb 17 2025 9:26 PM | Updated on Feb 18 2025 8:55 AM

Renuka, Wareham Spark RCB Bowl out Delhi Capitals for 141

డబ్ల్యూపీఎల్‌-2025లో భాగంగా వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత ‍బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది.

రేణుకా సింగ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను  ఔట్ చేసి ఢిల్లీకి షాకిచ్చింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్‌, రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ లానింగ్‌(17), రోడ్రిగ్స్ ఔటయ్యాక ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది.

ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్‌, జార్జియా వేర్‌హామ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్‌, ఏక్తా బిస్త్ తలా రెండు వికెట్లు సాధించారు. ఢిల్లీ బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సారా బ్రైస్(23), అన్నాబెల్ సదర్లాండ్(19) రాణించారు.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్‌: మెగ్ లానింగ్ (కెప్టెన్‌​), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్‌), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్‌: స్మృతి మంధాన(కెప్టెన్‌), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్‌), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement