కేకేఆర్‌పై ఆర్‌సీబీ ఘన విజయం

RCB Won By 8 Wickets Against KKR - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌ విధించిన 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో దేవదూత్‌ పడిక్కల్, ఫించ్‌లు కలిసి మొదటి వికెట్‌కు  46 పరుగులు జోడించారు.  6వ ఓవర్‌ బౌలింగ్‌ వచ్చిన పెర్గూసన్‌ బౌలింగ్‌లో రెండో బంతికి ఫించ్‌ 16 పరుగుల వద్ద ఔటవ్వగా.. అదే ఓవర్లో నాలుగో బంతికి దేవదూత్‌ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. గురుకీరత్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా 13.3 ఓవర్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్‌ బౌలర్లలో పెర్గూసన్‌ ఒక వికెట్‌ తీశాడు. కాగా ఈ విజయంతో ఆర్‌సీబీ రన్‌రేట్‌ను మరింత మెరుగుపరుచుకొని మొత్తం 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయినా పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, 5 ఓటమిలతో  నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది.కాగా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచిన మహ్మద్‌ సిరాజ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. (చదవండి : 84 పరుగులకే చాప చుట్టేసిన కేకేఆర్‌)

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న కేకేఆర్‌.. ఆర్‌సీబీ బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాటపటిమ కనబర్చలేదు. కాగా కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 30 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో జట్టు స్కోరు 60 పరుగులు దాటుటుందా అన్న దశలో చివర్లో లోకీ పెర్గ్యూసన్‌ 19 పరుగులు, కుల్దీప్‌ యాదవ్‌ 12 పరుగులు చేయడంతో 84 పరుగులు చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 3వికెట్లు, చహల్‌ 2, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైనీ తలా ఒక వికెట్‌ తీశారు.
(చదవండి : ఎందుకన్నయ్య మీరు ఇలా చేశారు..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top