ఎందుకన్నయ్య మీరు ఇలా చేశారు.. 

Watch Video Of Child Crying For CSK Poor Performance In IPL 2020  - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటతీరు, ఫేలవ ప్రదర్శనపై రోజురోజుకి విమర్శలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ధోని ఆటతీరుపై, అతని కెప్టెన్సీపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడి కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన చెన్నైకి ప్లేఆఫ్‌ అవకాశాలు మూసుకుపోయాయి. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో ఎంటరైన చెన్నై 2018లో చాంపియన్‌, 2019లో రన్నరప్‌గా నిలిచింది. కానీ సరిగ్గా ఏడాది తర్వాత చూసుకుంటే అదే చెన్నై కనీసం మ్యాచ్‌లను గెలవడానికే అష్టకష్టాలు పడుతుంది. మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కేనేనా ఆడుతుంది అంటూ ఫ్యాన్స్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి : గేల్‌ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్‌ చేయాలి)

తాజాగా సీఎస్‌కే ప్రదర్శనపై ఒక బుడ్డోడు మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. చెన్నై ప్లే ఆఫ్‌ అవకాశాలు మూసుకుపోవడంతో ఆ బుడ్డోడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ' మీకేం తెలుసు అన్నయ్యా మా బాధలు.. మీరేమో ఎక్కడో ఉంటారు.. చెన్నై ఇంటికి వెళ్లిపోయింది... నువ్వు కూడా ఇంటికి వెళ్లి పడుకోరా.. అని అంటున్నారు.  ఇంకొకడమో.. ధోని , వాట్సన్‌, బ్రావోలకు గోవిందా చెప్పే టైమ్‌ వచ్చేసిందంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకన్నయ్యా మీరు ఇలా చేశారు. ' అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు.

'చెన్నై జట్టు మొత్తం సీనియర్లతో నిండిపోయిందని.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత ధోని మెదుడు పనిచేయడం మానేసిందని.. సీఎస్‌కే టీం మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. ఈ సీజన్‌లో చెన్నై జట్టు టీ20లు ఆడడం మరిచిపోయి టెస్టు మ్యాచ్‌లను ఆడుతుందంటూ ' సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. (చదవండి : మ్యాక్స్‌వెల్‌ ఆటతీరుపై క్లారిటీ ఇచ్చిన రాహుల్‌) 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top