ఎస్‌ఆర్‌హెచ్‌కు తప్పని గండం | RCB Secure Qualifier 1 Spot Despite Defeat, SRH Finish Third On Net Run Rate After Big Win Against RCB, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌కు తప్పని గండం

May 23 2026 9:15 AM | Updated on May 23 2026 10:38 AM

RCB secure Qualifier 1 spot despite defeat, SRH finish third

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 22) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్‌ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌ గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్‌కు సుఖం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తద్వారా ఎలిమినేటర్‌ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జట్టు ఫైనల్‌కు చేరాలంటే మరో రెండు గండాలు (ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2) దాటాల్సి ఉంటుంది. 

ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్‌లో 90 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచి ఉంటే, రన్‌రేట్‌ బాగా మెరుగై టాప్‌-2లోకి చేరిది. అప్పుడు క్వాలిఫయర్‌-1 బెర్త్‌ దక్కేది. క్వాలిఫయర్‌-1కు చేరితే ఓ అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఈ అడ్వాంటేనే ఎస్‌ఆర్‌హెచ్‌ మిస్‌ చేసుకుంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడినా మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్సీబీ టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. గుజరాత్‌ రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ రెండు జట్లు మే 26న ధర్మశాల వేదికగా జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1 విజేతతో మే 29న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో తలపడుతుంది.

ఆర్సీబీ, గుజరాత్‌తో పాటు సన్‌రైజర్స్‌ కూడా తలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. ఆర్సీబీ (0.783), గుజరాత్‌ (0.695)తో పోలిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ (0.524) కాస్త తక్కువ రన్‌రేట్‌ కలిగి ఉండటంతో ఎలిమినేటర్‌ ఆడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రత్యర్దిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతుంది. ఈ జట్లలో ఓ జట్టు మే 27న ముల్లాన్‌పూర్‌లో జరిగే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌లో తలపడుతుంది.

ప్లే ఆఫ్స్‌ నాలుగో బెర్త్‌ కోసం అధికారింగా నాలుగు జట్లు పోటీపడుతున్నా,  ప్రధాన పోటీ మాత్రం రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌ మధ్య మాత్రమే ఉంది. వీటిలో పంజాబ్‌ భవిష్యత్తు నేటితో తేలిపోతుంది. ఇవాళ జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ లక్నోతో తలపడనుంది. లక్నోతో పాటు ముంబై, సీఎస్‌కే ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement