2023లో ఒకే ఒక్కడు రవీంద్రుడు..! | Ravindra Jadeja Is The Only Player To Score 600 Runs And Pick 60 Wickets In 2023 | Sakshi
Sakshi News home page

2023లో ఒకే ఒక్కడు రవీంద్రుడు..!

Dec 31 2023 4:19 PM | Updated on Dec 31 2023 4:19 PM

Ravindra Jadeja Is The Only Player To Score 600 Runs And Pick 60 Wickets In 2023 - Sakshi

2023లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్ని విభాగాల్లో అదరగొట్టాడు. ఈ ఏడాది పొడుగునా బంతితో పాటు బ్యాట్‌తోనూ ఇరగదీసిన జడ్డూ.. ఫీల్డింగ్‌లోనూ మ్యాజిక్‌ చేశాడు. అన్ని ఫార్మాట్లతో అద్బుతమైన క్యాచ్‌లు అందుకున్న జడ్డూ.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో పదుల సంఖ్యలో పరుగులను నియంత్రించాడు. 2023 సంవత్సరం ఇవాల్టితో పూర్తికానున్న నేపథ్యంలో జడ్డూకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

జడేజా ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు (35 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు) తీసిన బౌలర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ (28 ఇన్నింగ్స్‌ల్లో 30.65 సగటున రెండు అర్దసెంచరీల సాయంతో 613 పరుగులు) అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాడు. తద్వారా జడ్డూ ఈ ఏడాది బ్యాట్‌తో 600 పరుగులు, బంతితో 60 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఆసక్తికర గణాంకాల గురించి తెలిసి ఫ్యాన్స్‌ జడ్డూపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సర్‌ జడేజా ఎట్‌ హిస్‌ బెస్ట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన రికార్డులు భారత ఆటగాళ్ల ఖాతాలోనే ఉండటం విశేషం. బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (52 ఇన్నింగ్స్‌ల్లో 2154 పరుగులు) ఈ ఏడాది లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలువగా.. బౌలింగ్‌లో జడ్డూ లీడింగ్‌ వికెట్‌టేకర్‌ ఆఫ్‌ 2023గా నిలిచాడు. ఈ రెండు విభాగాల్లో రెండో స్థానాల్లోనూ భారత ఆటగాళ్లే ఉండటం మరో విశేషం.

బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లి (36 ఇన్నింగ్స్‌ల్లో 2048), బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ (39 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు) ఈ ఏడాది రెండో అత్యుత్తమ గణాంకాలు కలిగిన ఆటగాళ్లుగా ఉన్నారు. అలాగే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల టాప్‌-10లోనూ పలువురు భారత ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌ టాప్‌-10లో గిల్‌, కోహ్లితో పాటు రోహిత్‌ శర్మ (39 ఇన్నింగ్స్‌ల్లో 1800 పరుగులు,నాలుగో స్థానం).. బౌలింగ్‌లో జడేజా, కుల్దీప్‌లతో పాటు మొహమ్మద్‌ సిరాజ్‌ (34 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు, ఐదు), మొహమ్మద్‌​ షమీ (23 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు, ఎనిమిది) టాప్‌-10లో నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement