అశ్విన్‌ దృష్టిలో బెస్ట్‌ ఐపీఎల్‌ టీం ఏది? | Ravichandran Ashwin Picks His All Time IPL XI, No Place For Chris Gayle, Check Names Inside | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ దృష్టిలో బెస్ట్‌ ఐపీఎల్‌ టీం ఏది?

Aug 29 2024 10:02 AM | Updated on Aug 29 2024 12:30 PM

Ravichandran Ashwin Picks His All Time IPL XI, No Place For Chris Gayle

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్‌ కమ్‌ వికెట్‌కీపర్‌గా ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి.. వన్‌డౌన్‌లో సురేశ్‌ రైనా, నాలుగో స్థానం కోసం సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్‌, ఆరో స్థానంలో ధోని, స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా సునీల్‌ నరైన్‌, రషీద్‌ ఖాన్‌, పేసర్లుగా భువనేశ్వర్‌ కుమార్‌, లసిత్‌ మలింగ, జస్ప్రీత్‌ బుమ్రా పేర్లను ప్రకటించాడు.

అశ్విన్‌ తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఐపీఎల్‌ జట్టులో విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌కు చోటు కల్పించకపోవడం ఆసక్తికరం. అశ్విన్‌ తన జట్టులో ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను కూడా ఎంపిక చేయలేదు. భారత జట్టు మాజీ ఓపెనర్‌ క్రిస్‌ శ్రీకాంత్‌కు చెందిన యూట్యూబ్‌ (చీకీ చీకా) ఛానల్‌తో మాట్లాడుతూ అశ్విన్‌ ఈ విషయాలను వెల్లడించాడు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఆయా రాష్ట్రాల్లో లోకల్‌ టోర్నీలు జరుగుతున్నాయి. త్వరలో దులీప్‌ ట్రోఫీ మొదలుకానుంది. అనంతరం బంగ్లాదేశ్‌ భారత్‌లో పర్యటిస్తుంది. ఆటగాళ్లంతా కచ్చితంగా దులీప్‌ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ప్రదర్శనల ఆధారంగానే బంగ్లా సిరీస్‌కు జట్టు ఎంపిక జరుగవచ్చు. ఏది ఎలా ఉన్నా అశ్విన్‌ మాత్రం భారత టెస్ట్‌ జట్టులో తప్పక ఉంటాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement