Ravindra Jadeja: జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా.. ఆసీస్‌తో మ్యాచ్‌ కోసం..

Ranji Trophy: Ravindra Jadeja Captain Saurashtra Against Tamilnadu - Sakshi

Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Saurashtra: మోకాలి గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడుతో పోటీపడుతున్న సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా 34 ఏళ్ల జడేజా గత ఏడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.

ఆసీస్‌తో మ్యాచ్‌ కోసం..!
ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా సౌరాష్ట్ర జట్టుకు దాదాపుగా నాకౌట్‌ బెర్త్‌ ఖరారు కావడంతో చివరి మ్యాచ్‌ నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ జయదేవ్‌ ఉనాద్కట్, సీనియర్‌ స్టార్‌ చతేశ్వర్‌ పుజారాలకు విశ్రాంతి ఇచ్చారు.  ఈ నేపథ్యంలో జడ్డూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా స్వదేశంలో సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో జడేజాకు చోటు ఇచ్చింది బీసీసీఐ. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో రంజీ ఆడేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం (జనవరి 24) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు:
సౌరాష్ట్ర
హార్విక్ దేశాయ్(వికెట్‌ కీపర్‌), చిరాగ్ జానీ, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవాడ, రవీంద్ర జడేజా(కెప్టెన్‌), సమర్థ్ వ్యాస్, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, యువరాజ్‌సిన్హ్ దోడియా, జే గోహిల్.

తమిళనాడు:
సాయి సుదర్శన్, నారాయణ్‌ జగదీశన్(వికెట్‌ కీపర్‌), బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్(కెప్టెన్‌), విజయ్ శంకర్, షారుక్ ఖాన్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, త్రిలోక్ నాగ్, మణిమారన్ సిద్ధార్థ్.

చదవండి: Australian Open: సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్‌ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు..
Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ.. ఇప్పుడు ‍కింగ్‌?

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top