Australian Open: సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్‌ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు..

Australian Open 2023: Djokovic Tommy Paul Ben Shelton Enters Quarters - Sakshi

Australian Open 2023- మెల్‌బోర్న్‌: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పదోసారి విజేతగా నిలిచేందుకు సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మూడు విజయాల దూరంలో ఉన్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ 6–2, 6–1, 6–2తో 22వ సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.

126 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ కేవలం ఐదు గేమ్‌లను మాత్రమే తన ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆరుసార్లు అలెక్స్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ 26 విన్నర్స్‌ కొట్టాడు. నెట్‌ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు నెగ్గిన అతను తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా ప్రత్యర్థికి బ్రేక్‌ పాయింట్‌ అవకాశం ఇవ్వలేదు.

గట్టెక్కి రెండోసారి..
మరోవైపు.. ఐదో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) ఐదు సెట్‌ల హోరాహోరీ పోరులో గట్టెక్కి రెండోసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుబ్లెవ్‌ 6–3, 3–6, 6–3, 4–6, 7–6 (11/9)తో హోల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు.

సంచలనం సృష్టించి.. జొకోవిచ్‌తో పాటు
అమెరికాకు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారులు టామీ పాల్, బెన్‌ షెల్టన్‌ తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో టామీ పాల్‌ 6–2, 4–6, 6–2, 7–5తో 24వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)పై, బెన్‌ షెల్టన్‌ 6–7 (5/7), 6–2, 6–7 (4/7), 7–6 (7/4), 6–2తో జేజే వుల్ఫ్‌ (అమెరికా)పై గెలిచారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రుబ్లెవ్‌తో జొకోవిచ్‌; బెన్‌ షెల్టన్‌తో టామీ పాల్‌ తలపడతారు.  

చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ.. ఇప్పుడు ‍కింగ్‌?
KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్‌! రిసెప్షన్‌ ఎప్పుడంటే..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top