
జొహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో రిషభ్ పంత్ వికెట్ పారేసుకున్న తీరు విమర్శలపాలైంది. తాను ఎదుర్కొన్న మూడో బంతికే ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడిన అతను డకౌటయ్యాడు. ఇది అతని సహజ శైలే అయినా ఆడిన సందర్భం తప్పని, దీనిపై పంత్‌తో మాట్లాడతామని ద్రవిడ్ అన్నాడు.
‘పంత్ ఎలా ఆడతాడనేది మనకందరికీ తెలుసు. అదే శైలితో అతను మంచి ఫలితాలు కూడా సాధించాడు. అయితే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా షాట్‌లను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని మేం చేస్తాం’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్!