అంపైర్‌‌‌తో వాగ్వాదానికి దిగిన అశ్విన్.. | R Ashwin Engages In Heated Conversation With On-field Umpire After Days Play, Know Details Inside - Sakshi
Sakshi News home page

IND Vs ENG 2nd Test: అంపైర్‌‌‌తో వాగ్వాదానికి దిగిన అశ్విన్..

Feb 3 2024 8:01 AM | Updated on Feb 3 2024 9:25 AM

R Ashwin engages in heated conversation with on-field umpire after days play - Sakshi

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు అధిపత్యం చెలాయించింది. ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌(179 నాటౌట్‌) భారీ సెంచరీ ఫలితంగా మొదటి రోజు ఆటలో భారత్‌ గట్టెక్కింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

అయితే జైశ్వాల్‌ మినహా భారత బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(14) పరుగులకే వెనుదిరగగా.. గిల్‌(34), శ్రేయస్‌ అయ్యర్‌(27), రజత్‌ పాటిదార్‌(32), అక్షర్‌ పటేల్‌(27), భరత్‌(17) విఫలమయ్యారు. జైశ్వాల్‌తో పాటు అశ్విన్‌ క్రీజులో ఉన్నాడు.

అంపైర్‌తో అశ్విన్‌ వాగ్వాదం..
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్‌ రవిచంద్రన్ అశ్విన్‌.. అంపైర్‌ మరైస్ ఎరాస్మస్‌తో వాగ్వాదంకు దిగాడు. మొదటి రోజు ఆటముగిసిన తర్వాత ఏదో విషయంపై అంపైర్‌తో అశ్విన్‌ మాటల యుద్దానికి దిగాడు.

పీటీఐ రిపోర్ట్‌ ప్రకారం.. మొదటి రోజు ఆట ముగిసే సమయంలో జైశ్వాల్‌తో మాటలను తగ్గించుకోవాలని అశ్విన్‌ను అంపైర్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అశ్విన్‌ అసహనానికి లోనయైనట్లు సమాచారం. అయితే అశ్విన్‌ కోపానికి గల స్పష్టమైన కారణమైతే తెలియదు.
చదవండి: సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్‌.. సెమీస్‌ బెర్త్‌ ఖారారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement