200 మంది లెఫ్ట్‌ హ్యాండర్స్‌.. తొలి బౌలర్‌గా రికార్డు

R Ashwin Becomes First Bowler Dismiss 200 Left Handers In Test Cricket - Sakshi

చెన్నై: సొంత మైదానంలో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్‌ తన టెస్టు కెరీర్‌లో 5 వికెట్లు తీయడం ఓవరరాల్‌గా చూసుకుంటే 29వ సారి కాగా.. స్వదేశంలో 23వ సారి 5 వికెట్ల ఫీట్‌ను సాధించాడు. కాగా అశ్విన్‌ స్వదేశంలో 45 టెస్టుల్లో 23 సార్లు 5 వికెట్ల ఫీట్‌ను అందుకోగా అతని కంటే ముందు లంక నుంచి మురళీధరన్( 45 సార్లు)‌, రంగన హెరాత్‌(26 సార్లు)​, టీమిండియా బౌలింగ్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(25 సార్లు) స్వదేశంలో 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ స్వదేశంలో 89 టెస్టులాడి 22 సార్లు 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు.

దీంతో పాటు అశ్విన్‌ మరో అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 200 మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఔట్‌ చేసిన తొలి క్రికెటర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. ఇందులో డేవిడ్‌ వార్నర్‌ను 10 సార్లు, అలిస్టర్‌ కుక్‌, స్టోక్స్లను 9 సార్లు, జేమ్స్‌ అండర్సన్‌, ఎడ్‌ కొవాన్‌లను 7 సార్లు చొప్పున​ ఔట్‌ చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్‌ ఐదు వికెట్లు తీయడం ద్వారా భజ్జీని అధిగమించి స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇండియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

స్వదేశంలో 45 టెస్టులాడిన అశ్విన్‌ 268 వికెట్లు తీశాడు. ఇందులో 23 సార్లు 5 వికెట్ల చొప్పున, 6 సార్లు పది వికెట్ల చొప్పున సాధించాడు. టీమిండియా నుంచి తొలి స్థానంలో లెగ్‌ స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే 62 టెస్టుల్లో​ 350 వికెట్లు తీశాడు. ఇందులో 25 సార్లు 5 వికెట్ల ఫీట్‌, 7 సార్లు 10 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే అశ్విన్‌ ఇప్పటివరకు టీమిండియా తరపున 77 టెస్టుల్లో 396 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు.
చదవండి: వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి
పంత్‌,ఇంగ్లండ్‌ కీపర్‌ గొడవ.. మధ్యలో స్టోక్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top