Team India Players Get Chance Top 10 In The ICC Test Rankings - Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే

Jan 30 2021 6:27 PM | Updated on Jan 30 2021 9:02 PM

Pujara Ranks In 6Th But Kohli Remains Same In ICC Test Rankings - Sakshi

దుబాయ్‌: ఐసీసీ శనివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చోటు సంపాదించారు. బ్యాటింగ్‌ విభాగానికి వస్తే..  భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 862 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా.. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ఒకస్థానం ఎగబాకి 760 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే 748 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఒక కివీస్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌(891), మార్నస్‌ లబుషేన్‌(878) ఉన్నారు. జో రూట్‌ 823 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

బౌలింగ్‌ విషయానికి వస్తే..  ఆసీస్‌ స్టార్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో టాప్‌ స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్టువర్ట్‌ బ్రాడ్‌(839), నీల్‌ వాగ్నర్‌(825), జోష్‌ హాజిల్‌వుడ్‌(816), టిమ్‌ సౌథీ(811) పాయింట్లతో వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా నుంచి అశ్విన్‌(760) పాయింట్లతో 8వస్థానం,పేసర్ ‌జస్‌ప్రీత్‌‌ బుమ్రా (757) పాయింట్లతో 9వ స్థానంలో నిలిచారు. ఇక ఆల్‌రౌండ్‌ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు. ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ రెండు, టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: ఐపీఎల్‌లో‌ ఆడేందుకు నేను సిద్ధం

Advertisement
 
Advertisement
Advertisement