
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు 39–37తో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున మీతూ 12 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ చెరో 9 పాయిం ట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–26తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది.