PKL 2023: స్టీలర్స్‌కు ఐదో విజయం  | PKL 2023: Skipper Jaideep Shines Haryana Steelers Beat Tamil Thalaivas, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

PKL 2023: స్టీలర్స్‌కు ఐదో విజయం 

Dec 26 2023 8:17 AM | Updated on Dec 26 2023 11:36 AM

PKL 2023 Skipper Jaideep Shines Haryana Steelers Beat Tamil Thalaivas - Sakshi

స్టీలర్స్‌కు ఐదో విజయం (PC: PKL)

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో హరియాణా స్టీలర్స్‌ జోరు కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 42–29తో తమిళ్‌ తలైవాస్‌ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ లీగ్‌లో స్టీలర్స్‌కిది ఐదో విజయం కావడం విశేషం.

స్టీలర్స్‌ తరఫున శివమ్‌ ఎనిమిది పాయింట్లు సాధించగా... జైదీప్‌ దహియా, రాహుల్‌ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. తలైవాస్‌ తరఫున సాహిల్‌ గులియా పది పాయింట్లు, హిమాన్షు సింగ్‌ తొమ్మిది పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 38–29తో బెంగాల్‌ వారియర్స్‌ జట్టుపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్‌ తలపడుతుంది.    

మెయిన్‌ ‘డ్రా’కు హుమేరా అర్హత 
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ హుమేరా బహార్మస్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో హుమేరా గెలిచి మెయిన్‌ ‘డ్రా’లోకి అడుగు పెట్టింది.

క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన హుమేరా రెండో రౌండ్‌లో 6–1, 6–3తో అలెగ్జాండ్రా అజార్కో (రష్యా)పై, మూడో రౌండ్‌లో 3–6, 6–2, 6–4తో జెన్నిఫర్‌ లుఖమ్‌ (భారత్‌)పై విజయం సాధించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement