గుండెనొప్పితో మైదానంలో కుప్పకూలి.. ఆటగాడు మృతి; నేను బతికే ఉన్నా: పాక్‌ పేసర్‌

Pakistan Usman Shinwari Tweet Over His Namesake Dies On Field News - Sakshi

Pakistan Pacer Usman Shinwari: తాను బతికే ఉన్నానని, దయచేసి పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఉస్మాన్‌ శిన్వారి విజ్ఞప్తి చేశాడు. తాను చనిపోయానన్న వార్త విని బంధువులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నాడు. దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా తన అభిమానులు, బంధువులకు స్పష్టతనిచ్చాడు.

అసలేం జరిగిందంటే..
పాకిస్తాన్‌ కార్పొరేట్‌ లీగ్‌లో భాగంగా లాహోర్‌లోని చోబ్లీ టౌన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫ్రైస్‌ల్యాండ్‌, బర్జర్‌ పెయింట్స్‌ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా.. ఉస్మాన్‌ శిన్వారి అనే క్రికెటర్‌ గుండెనొప్పితో మైదానంలో కుప్పకూలాడు.

అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. హఠాన్మరణం చెందిన శిన్వారి అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే, పాక్‌ జాతీయ జట్టుకు ఆడిన ఉస్మాన్‌ పేరు.. మరణించిన ఆటగాడి పేరు ఒకే విధంగా ఉండటంతో చాలా మంది ఉస్మాన్‌ మరణించినట్లుగా వార్తలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో చనిపోయింది తాను కాదంటూ ట్విటర్‌ వేదికగా పాక్‌ పేసర్‌ ఉస్మాన్‌ శిన్వారి ఆదివారం స్పష్టతనిచ్చాడు.

చివరిసారిగా అప్పుడే..
పాకిస్తాన్‌ తరఫున చివరిసారిగా 2019లో మైదానంలో దిగాడు ఉస్మాన్‌ శిన్వారి. శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ ఆడాడు. ఇప్పటి వరకు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 

కాగా ఇప్పటి వరకు అతడు పాక్‌ తరఫున ఒక టెస్టు, 17 వన్డేలు, 16 టీ20లు ఆడి వరుసగా ఆయా ఫార్మాట్లలో ఒకటి, 34, 13 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే... పాక్‌ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉంది. కరాచీలో జరిగిన నాలుగో టీ20లో గెలుపొందిన బాబర్‌ సేన ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

చదవండి: Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అయితే!
Ind Vs Aus 3rd T20: ద్రవిడ్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్‌ తర్వాత రెండో భారత బ్యాటర్‌గా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top