రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం | No Rishabh Pant at Delhi Premier League 2026 as DDCA President declares India duty first | Sakshi
Sakshi News home page

DPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం

Jul 1 2026 9:28 PM | Updated on Jul 1 2026 9:28 PM

No Rishabh Pant at Delhi Premier League 2026 as DDCA President declares India duty first

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌-2026 సీజన్ నుంచి పంత్ వైదొలిగాడు. డీపీఎల్ మూడో సీజ‌న్ వేలానికి ముందు 'పురాణీ దిల్లీ 6' ఫ్రాంచైజీ విడుద‌ల చేయ‌డంతో, అత‌డు తొలిసారి అక్ష‌న్‌లో కనిపించబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. 

కానీ బుధ‌వారం జ‌రిగిన వేలంలో పంత్ పేరు లేక‌పోవ‌డంతో అంద‌రూ షాక‌య్యారు. అయితే జాతీయ విధుల కార‌ణంగా అత‌డు డీపీఎల్ మూడో సీజ‌న్ నుంచి త‌ప్పుకొన్న‌ట్లు ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసెడింట్‌ రోహన్ జైట్లీ తెలిపారు.  రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీ లీగ్ కంటే పంత్‌కు దేశం తరఫున ఆడటమే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 

ఈ ఏడాది డీపీఎల్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా విడుద‌ల కాన‌ప్ప‌టికి.. ఈ టోర్న‌మెంట్  జూలై 31 నుండి ఆగస్టు 30 మధ్య జరిగే అవకాశం ఉంది. ఇదే స‌మ‌యంలో శ్రీలంక‌తో భార‌త్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ త‌ల‌ప‌డ‌నుంది. పంత్ టెస్టు జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.

ఈ నేప‌థ్యంలో వ‌ర్క్‌లోడ్ మేనెజ్‌మెంట్ కార‌ణంగా డీపీఎల్‌కు దూరంగా ఉండాల‌ని పంత్ నిర్ణ‌యించుకున్నాడు. కాగా పంత్‌ ఐపీఎల్‌-2027 ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్‌ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement