గోల్డెన్‌ డక్‌ విషయంలో నితీష్‌ రాణా చెత్త రికార్డు

Nitish Rana Fifth Golden Duck Since Start Of 2020 - Sakshi

Nitish Rana Golden Duck.. గోల్డెన్‌ డక్‌ విషయంలో కేకేఆర్‌ బ్యాటర్‌ నితీష్‌ రాణా చెత్త రికార్డు నమోదు చేశాడు. 2020 ఏడాది ఆరంభం మొదలైనప్పటి నుంచి నితీష్‌ రాణా ఐదుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగడం విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే సీఎస్‌కేతో జరుగుతున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌ ఓటమి దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్‌కే ఓపెనర్‌ డుప్లెసిస్‌ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్‌ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్‌ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి 1 వికెట్‌ తీశాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top