క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్‌ | Nishant Dev, Sanjeet into quarter-finals Mens Boxing World Championships | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్‌

Nov 2 2021 5:31 AM | Updated on Nov 2 2021 5:31 AM

Nishant Dev, Sanjeet into quarter-finals Mens Boxing World Championships - Sakshi

బెల్‌గ్రేడ్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు), సంజీత్‌ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్‌ ఫైనల్‌  చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్‌ పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌ల్లో నిశాంత్‌ దేవ్‌ 3–2తో మార్కో అల్వారెజ్‌ వెర్డె (మెక్సికో)పై, సంజీత్‌ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో రోహిత్‌ (భారత్‌) 1–4తో సెరిక్‌ (కజకిస్తాన్‌) చేతిలో.... ఆకాశ్‌ సాంగ్వాన్‌ (67 కేజీలు) 0–5తో కెవిన్‌ బ్రౌన్‌ (క్యూబా) చేతిలో ... సుమిత్‌ (75 కేజీలు) 0–5తో యోన్లిస్‌ (క్యూబా) చేతిలో... దీపక్‌ 0–5తో సాకెన్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement