NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్..

నెదర్లాండ్స్ టూర్‌ను న్యూజిలాండ్ విజయంతో ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టి20లో కివీస్ 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం అందుకుంది. రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్టిన్ గప్టిల్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జేమ్స్ నీషమ్ 32 పరుగులు సాధించాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. బాస్ డీ లీడి (53 బంతుల్లో 66, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నంతవరకు నెదర్లాండ్స్ విజయంపై ఆశలు పెంచుకుంది. ఒక సందర్భంలో ఈ డచ్ బ్యాటర్ న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అయితే లీడీతో పాటు స్కాట్ ఎడ్‌వర్డ్స్(20 పరుగులు) ఔటైన తర్వాత డచ్ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4, బెన్ సీయర్స్ 3, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇవాళ(ఆగస్టు 8) జరగనుంది.
చదవండి: Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు