New Zealand Captain Mitchell Santner Tests Positive For COVID 19 - Sakshi
Sakshi News home page

IRE vs NZ: ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!

Jul 3 2022 12:19 PM | Updated on Jul 3 2022 9:10 PM

New Zealand captain Mitchell Santner tests positive for COVID 19  - Sakshi

File Photo

ఐర్లాండ్‌ పర్యటనకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలలో అతడికి పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సాంట్నర్‌ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇక ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డబ్లిన్‌ వేదికగా జూలై 10న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు రెగ్యూలర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కావడంతో.. వన్డే సిరీస్‌కు టామ్‌ లాథమ్‌,టీ20 సిరీస్‌లకు సాంట్నర్‌ను కెప్టెన్‌లుగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ నియమించింది.

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు
టామ్‌ లాథమ్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌, మిచెల్‌ బ్రాస్‌వెల్‌, డేన్‌ క్లీవర్‌(వికెట్‌ కీపర్‌), జాకోబ్‌ డాఫీ, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, మ్యాట్‌ హెన్రీ, ఆడమ్‌ మిల్నే, హెన్రీ నికోల్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధి, బ్లేర్‌ టిక్నెర్‌, విల్‌ యంగ్‌.

ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు
మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, మిచెల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేన్‌ క్లీవర్‌(వికెట్‌ కీపర్‌), లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, ఆడం మిల్నే, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ రిప్పన్‌, బెన్‌ సీర్స్‌, ఇష్‌ సోధి, బ్లేర్‌ టిక్నెర్‌.
చదవండి: New Zealand Squads: విలియమ్సన్‌ లేకుండానే వరుస సిరీస్‌లు.. జట్లు ఇవే! కెప్టెన్లు ఎవరంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement