Ishan Kishan Says Never Once Has It Crossed My Mind That I Want Pant Place - Sakshi
Sakshi News home page

Rishabh Pant: 'పంత్‌ నాకు మంచి స్నేహితుడు.. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు'

Feb 22 2022 4:01 PM | Updated on Feb 22 2022 7:00 PM

Never once has it crossed my mind that I want Pant place says Ishan Kishan - Sakshi

టీమిండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ తన సహచర ఆటగాడైన రిషభ్‌ పంత్‌పై తన మనసులోని మాటను వెల్లడించాడు. 2016 అండర్‌-19 ప్రంపచప్‌లో వీరిద్దరూ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పంత్‌, కిషన్‌ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. అదే విధంగా అండర్‌-19 ప్రపంచప్‌లో కెప్టెన్‌గా కిషన్‌ వ్యవహరిస్తే.. పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే పంత్‌ ఇప్పటికే భారత జట్టులో కీలక ఆటగాడిగా మారగా.. కిషన్‌ నెమ్మదిగా తన సత్తాను చాటు కుంటున్నాడు. అతడు కేవలం 4 వన్డేలు, 8 టీ20 లు మాత్రమే భారత తరుపున ఆడాడు. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే కిషన్‌ అర్ధ సెంచరీతో మెరిశాడు. 

"పంత్‌ నాకు మంచి స్నేహితుడు. మేము ఇద్దరం కలిసి ఎక్కువగా తిరగుతూ ఉంటాం. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తాం. మేము క్రికెట్‌ గురించి ఒకరితో ఒకరు ఎ‍క్కువగా చర్చించుకుంటాం. నా మనసులో మాటను అతడితో చెప్పుకుంటాను. అతడు కూడా అంతే.. తన విషయాలను నాతో షేర్‌ చేసుకుంటాడు. ఎప్పుడు కూడా జట్టులో పంత్‌ స్ధానం నాకు కావాలి అని అనుకోలేదు. ఇద్దరికీ జట్టులో స్ధానం ఉన్నందున అతడిని ఎప్పుడూ ఒక పోటీదారుగా చూడలేదు. పంత్‌ కూడా అంతే ఎప్పడూ తనకు పోటీగా నన్ను చూడలేదు. అయితే జట్టులో స్ధానం గురించి నేను ఎప్పడూ ఆలోచించలేదు. మనం  బాగా ఆడితే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నాకు ముఖ్యంగా వికెట్‌ కీపింగ్‌ అంటే చాలా ఇష్టం.  కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను" అని కిషన్‌ పేర్కొన్నాడు.

చదవండి: Rohit Sharma: 'రోహిత్‌కి ఇప్పటికే 34 ఏళ్లు.. ఇంకా ఎన్నాళ్లు ఆడుతాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement