నేపాల్‌ను చిత్తు చేసిన నెదర్లాండ్స్‌.. | Netherlands begin campaign with 6-wicket win over Nepal in Group D | Sakshi
Sakshi News home page

NEP vs NED: నేపాల్‌ను చిత్తు చేసిన నెదర్లాండ్స్‌..

Jun 5 2024 7:34 AM | Updated on Jun 5 2024 8:39 AM

Netherlands begin campaign with 6-wicket win over Nepal in Group D

టీ20 వరల్డ్‌కప్‌-2024లో నెదర్లాండ్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం డల్లాస్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 19.2 ఓవర్లలో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. 

డచ్‌ బౌలర్లు టామ్‌ ప్రింగల్‌, వాన్‌ బీక్‌ తలా మూడు వికెట్లతో నేపాల్‌ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు వాన్‌మీకరన్‌, బాస్‌డీలీడ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డచ్‌ బౌలర్లు నేపాల్‌ను ఏ దశలోనూ కోలుకునే ఛాన్స్‌ ఇవ్వలేదు.

 నెదర్లాండ్స్‌  బౌలర్ల దాటికి నేపాల్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నేపాల్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ పాడౌల్‌(35) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 107 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. 

డచ్‌ బ్యాటర్లలో మాక్స్‌ ఔడౌడ్‌(54) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నేపాల్‌ బౌలర్లలో సోమ్‌పాల్‌ కామి, దీపేంద్ర సింగ్‌, అబినాష్ బోహరా తలా మూడు వికెట్లు పడగొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement