కోహ్లి, రోహిత్‌లను అడ్డుకుంటాము.. భారత్‌కు పోటీ ఇస్తాం: నేపాల్‌ కెప్టెన్‌ | Nepal Captain Ahead Of Asia Cup 2023 Clash Against India - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: కోహ్లి, రోహిత్‌లను అడ్డుకుంటాము.. భారత్‌కు పోటీ ఇస్తాం: నేపాల్‌ కెప్టెన్‌

Published Mon, Sep 4 2023 9:36 AM

Nepal Captain Ahead Of Asia Cup Clash Against India - Sakshi

ఆసియాకప్‌లో తొలిసారి ఆడుతున్న నేపాల్‌ మరో కీలకపోరుకు సిద్దమైంది. సోమవారం క్యాండీ వేదికగా టీమిండియాతో నేపాల్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్ పౌడెల్ విలేకురల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్‌ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నామని తెలపాడు.

కాగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ భారీ ఓటమి చవిచూసింది. దీంతో భారత్‌ జరగనున్న మ్యాచ్‌ నేపాల్‌కు డూ ఆర్‌డైగా మారింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌  ఓటమి పాలైతే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టనుంది.

"ప్రపంచక్రికెట్‌లో అత్యత్తమ జట్లలో భారత్‌ ఒకటి. అటువంటి జట్టుతో మాకు ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌తో తలపడేందుకు మేము అతృతగా ఎదురుచూస్తున్నాము. గత మూడేళ్ల నుంచి మేము తీవ్రంగా శ్రమిస్తున్నాము. అందుకే ఇటువంటి మెగా టోర్నీలో భాగమయ్యే అవకాశం లభించింది. మా కంటే ముందు తరం క్రికెటర్లు ఇటువంటి టోర్నీల్లో ఆడేందుకు చాలా ప్రయత్నించారు.

కానీ వారు అది సాధించలేకపోయారు. కాబట్టి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకంటాము. ఇక విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ భారత జట్టులో స్టార్‌ ఆటగాళ్లగా కొనసాగుతున్నారు. వారిని ఎదుర్కోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసాము. విరాట్‌ మా అందరికి ఆదర్శమని" ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరేన్స్‌లో రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌..

Advertisement

తప్పక చదవండి

Advertisement