టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరికొంతకాలం కెరీర్ పొడిగించుకునే క్రమంలో ఇప్పటికే దాదాపు పది కిలోల బరువు తగ్గాడు. అంతటితో ఆగకుండా మరింత సన్నబడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
స్లిమ్‌గా మారిన రోహిత్ శర్మ
ఈ క్రమంలో మునుపటి కంటే మరింత స్లిమ్‌గా మారిన రోహిత్ శర్మ లుక్ (Rohit Sharma Transformation) చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ సహ యజమాని నీతా అంబానీ సైతం రోహిత్‌లో వచ్చిన మార్పు చూసి ఫిదా అయ్యారు. కాగా ఐపీఎల్-2026 టోర్నీకి శనివారం తెరలేవనున్న సంగతి తెలిసిందే.
బెంగళూరు వేదికగా ఆర్సీబీ- సన్‌రైజర్స్ (RCB vs SRH) మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుండగా.. మార్చి 29న ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. నీతా అంబానీ వచ్చి ఆటగాళ్లను పలకరించారు.
నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదు
ఈ సందర్భంగా ముంబై కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లతో కరచాలనం చేసిన ఆమె.. రోహిత్ శర్మను చూసి షాకయ్యారు. ‘‘ఓరి దేవుడా!.. రోహిత్ నేనసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. నువ్వు కుర్రాడిలా కనిపిస్తున్నావు’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు రోహిత్ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వన్డేలలో కొనసాగుతున్న రోహిత్
కాగా 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2027లొ టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
కెప్టెన్ హోదాలో భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను రోహిత్ అందించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు రోహిత్. కాగా ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టులో కొనసాగుతున్నాడు.
చదవండి: IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
Mrs. Nita Ambani met the squad during training ahead of the start of TATA IPL 2026! 💙 pic.twitter.com/r2Gy9NaDOc
— Mumbai Indians (@mipaltan) March 27, 2026


