
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో అడుగుపెట్టాడు. రానున్న సీజన్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించడానికి ధోని చెన్నై చేరుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. అయితే మెగా వేలం కోసం బెంగళూరుకు వెళ్లే ముందు ధోని చెన్నైలో ఉండనున్నాడు. రానున్న వేలంలో జట్టు వ్యూహాలపై ధోని.. యాజమాన్యంతో చర్చించనున్నాడు. అంతే కాకుండా వేలం సమయంలో ఎంఎస్ ధోని స్వయంగా హాజరుకానున్నట్లు సమాచారం.
"అవును ధోని ఈరోజు చెన్నై చేరుకున్నాడు. వేలం చర్చల కోసం ఆయన ఇక్కడకు వచ్చారు. ఆయన వేలానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఆయన నిర్ణయమే అంతిమం" అని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్స్‌గా ఎంఎస్ ధోని నిలిపాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ ధోనికి చివరి సీజన్ కానున్నందని వార్తలు వినిపిస్తున్నాయి.