ధోని కూతురు జీవా విజిల్‌ పోడు..

MS Dhoni Daughter Centre Of Attraction By Whistle Podu Viral CSK Vs SRH - Sakshi

Dhoni Daughter Jeeva Whistle Podu.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని కూతురు జీవా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సీఎస్‌కే జట్టు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజిల్‌ పోడు.. సెకండ్‌ఫేజ్‌ ప్రారంభంలో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే విజిల్‌ పోడు అనే అంశాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చి తమ ప్రమోషన్‌కు వాడుకుంది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. తాజాగా ధోని కూతురు జీవా కూడా మ్యాచ్‌ మధ్యలో విజిల్‌ వేస్తూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. చేతిలో ఈల పట్టుకొని సాక్షిధోని పక్కన నిల్చొని విజిల్‌ వేస్తూ ఉత్సాహంగా కనిపించింది. జీవా ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన సీఎస్‌కే 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రుతురాజ్‌ 31, డుప్లెసిస్‌ 15 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: Ashwin Vs Morgan: 'అశ్విన్‌ ఒక చీటర్'‌.. ఆసీస్‌ మీడియా సంచలన వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top