
Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ టీ20 కప్ టోర్నీలో సెంట్రల్ పంజాబ్ జట్టుకు హఫీజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆజట్టు స్ధానికంగా ఓ హోటల్‌లో బస చేస్తుంది. ఈ క్రమంలో హోటల్‌లో అందించిన ఆహారాన్ని తినడం ద్వారా హఫీజ్ ఆరోగ్యం క్షీణించింది.
దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. నాణ్యత లేని ఆహారం అందించిన రెస్టారెంట్‌పై హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. కాగా వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ప్రకటించిన జట్టులో మహ్మద్ హఫీజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆక్టోబర్ 24న భారత్‌తో తలపడనుంది.
చదవండి: SRH vs PBKS: జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్