
హార్దిక్ పాండ్యా(Hardhik Pandya).. భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో టీమిండియాకు అద్బుతమైన విజయాలను అందిస్తున్నాడు. బంతితో మ్యాజిక్, బ్యాట్‌తో విధ్వంసం చేయగల సత్తా అతడిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ హార్ధిక్‌ది కీలక పాత్ర.
బౌలింగ్, బ్యాటింగ్‌లో పాండ్యా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ ఈ బరోడా ఆల్‌రౌండర్ సత్తాచాటాడు. ఈ క్రమంలో పాండ్యాను పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్ ప్రశంసించారు. పాండ్యా తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్బుతాలు చేస్తున్నాడని వారిద్దరూ కొనియాడారు.
"హార్దిక్ పాండ్యా ఏమి.. మాల్కం మార్షల్, వాకార్ యూనిస్, జవగల్ శ్రీనాథ్, బ్రెట్ లీ కాదు. ఈ లెజెండ్స్ లాంటి స్కిల్స్ పాండ్యాకు లేవు. కానీ బంతితో మాత్రం అద్బుతాలు సృష్టిస్తున్నాడు. కొత్త బంతితో చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన సత్తాచూపిస్తున్నాడు. హార్దిక్ అంత పెద్ద హిట్టర్ కూడా కాదు. కానీ తన టెక్నిక్‌తో భారీ షాట్లు ఆడుతున్నాడు. నిజంగా అతడిని మెచ్చుకోవాల్సిందే. 2000లో పాకిస్తాన్ జట్టులో హార్దిక్ లాంటి ఆటగాళ్లు చాలా మంది ఉండేవారు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా అక్తర్ చేసిన వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఏకీభవించాడు.
"అక్తర్ భాయ్ చెప్పింది అక్షరాల నిజం. అబ్దుల్ రజాక్ వంటి ఆల్‌రౌండర్ ప్రదర్శనలను చూస్తే మనకు ఆర్దమవుతోంది. అతడు హార్దిక్ పాండ్యా కంటే చాలా బెటర్. అతడొక మ్యాచ్ విన్నర్. కానీ పాకిస్తాన్ క్రికెట్‌లో అతడికి సరైన గౌరవం దక్కలేదు. రజాక్‌లో కూడా స్కిల్స్ తక్కువగా ఉన్నప్పటికి.. అద్బుతమైన ప్రదర్శన చేసే వాడని" హాఫీజ్ చెప్పుకొచ్చాడు.
కాగా రజాక్.. తన కెరీర్‌లో పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్‌లో వరుసగా 1946, 5080, 393 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి పేరిట 269 వికెట్లు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవగా.. పాకిస్తాన్ మాత్రం దారుణ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
చదవండి: WC 2027: రోహిత్ శర్మ ప్లానింగ్ ఇదే!.. అతడి మార్గదర్శనంలో సన్నద్ధం!
Comments
Please login to add a commentAdd a comment