పాకిస్తాన్‌తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Published Fri, Jan 12 2024 10:37 AM

Mitchell Santner Has Been Ruled Out Of First T20I Against Pakistan After Testing Positive For Covid - Sakshi

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు మిచెల్‌ సాంట్నర్‌ కోవిడ్‌ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న సాంట్నర్‌ జట్టులో లేకపోవడం కివీస్‌కు పెద్ద లోటు. సాంట్నర్‌ను సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్‌ న్యూజిలాండ్‌ పేర్కొంది.

కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 

ఇదిలా ఉంటే, ఆక్లాండ్‌ వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌ ఫుల్‌టైమ్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్‌ కాగా.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. 

న్యూజిలాండ్‌: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్‌), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్

పాకిస్తాన్‌: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), షాహీన్ అఫ్రిది (కెప్టెన్‌), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్

 
Advertisement
 
Advertisement