
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్‌కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.
ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్‌లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.
ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్‌లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు.
"వరల్డ్ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.
అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్‌కు బీసీసీఐ కనీసం ఫేర్‌వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.
దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు.