breaking news
Karsan Ghavri
-
అసలేం అనుకుంటున్నారు?: రోహిత్, కోహ్లి, గిల్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ తీరుపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) కు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డాడు. అనుభవం, నైపుణ్యం ఉన్న లెజెండ్ సలహాలు ఇస్తే.. వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరించాలే తప్ప.. ప్రతి విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యాడు.పాతికేళ్లకు పైగా..భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరొందిన సునిల్ గావస్కర్.. ఆ తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. పాతికేళ్లకు పైగా తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరిస్తూ.. మైదానంలో ఆటగాళ్లు చేసే తప్పులను విశ్లేషిస్తూ విమర్శలు చేస్తూంటాడు ‘లిటిల్ మాస్టర్’. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆట తీరును సందర్భానుసారం విమర్శిస్తూ కామెంట్లు చేశాడు.కోహ్లి కౌంటర్.. రోహిత్ ఫిర్యాదు!ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఐపీఎల్లో కోహ్లి స్ట్రైక్ రేటును ప్రస్తావించడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మపై గావస్కర్ చేసిన విమర్శలను వాళ్లు తేలికగా తీసుకోలేకపోయారు. తాను స్ట్రైక్‌రేటు గురించి కాకుండా .. జట్టు ప్రయోజనాల కోసమే ఆడతానని కోహ్లి స్పష్టం చేయగా.. గావస్కర్ కామెంట్రీపై రోహిత్ శర్మ ఏకంగా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉందిఈ పరిణామాల నేపథ్యంలో గావస్కర్ సహచర ఆటగాడు కర్సన్ ఘవ్రీ.. నవతరం ఆటగాళ్ల తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘గత 25 ఏళ్లకు పైగా గావస్కర్ కామెంట్రీ చేస్తున్నాడు. యువ ఆటగాళ్లకు ఆయన మాటలు విలువైన సలహాలు. కానీ.. మన ఆటగాళ్లలో కొందరు మాత్రం సలహాల కోసం గావస్కర్ వద్దకు వెళ్లనే వెళ్లరు.విదేశీ ఆటగాళ్లు గావస్కర్ సలహాల కోసం వస్తుంటే.. మనోళ్లు మాత్రం ఆయనను పట్టించుకోరు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు కచ్చితంగా గావస్కర్ వద్దకు వెళ్లాలి. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌కు ఆయన అవసరం ఎంతగానో ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ల ఆటను గావస్కర్ విమర్శించాడని వార్తలు వస్తాయే తప్ప.. సలహాల కోసం వాళ్లు ఆయనను సంప్రదించినట్లు ఎక్కడా కనబడదు. ఏదేమైనా గావస్కర్ సలహాలు ఇస్తే దానిని స్వీకరించకపోవడం నాన్సెన్స్ అనే చెప్పాలి.ఎవరైతే ఏంటి? అసలేం అనుకుంటున్నారు?నువ్వు రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లి అయితే ఏంటి?.. దిగ్గజాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గావస్కర్ ఏం చెప్పినా అది మీ మంచి కోసమే. అంతెందుకు రవిశాస్త్రి కూడా విమర్శలు చేస్తాడు. అయితే, గావస్కర్ తనదైన శైలిలో మంచీ, చెడూ విశ్లేషిస్తాడు’’ అని మాజీ పేసర్ కర్సన్ ఘవ్రీ విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్‌కు డాదాపు 16 ఏళ్ల పాటు తమ సేవలను అందించిన ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు మాత్రం లభించింది.ఈ కోవకు చెందిన వారే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. వారిద్దరూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా తమ టెస్టు కెరీర్లను ముగించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లిలు వారం రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియర్ ద్వయం లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లపై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐలో రాజకీయాల వల్లే వారిద్దరూ త్వరగా రిటైరయ్యారని ఆయన ఆరోపించాడు."వరల్డ్ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే సత్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన విరాట్‌కు బీసీసీఐ కనీసం ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేయలేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జరిగింది.దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కారాణాలతోనే కోహ్లి త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ కూడా కావాలనుకుంటే మరి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్దలు అతడిని జట్టు నుంచి బయటకు పంపాలని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు. -
‘అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తీరును మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ (Karsan Ghavri) విమర్శించాడు. పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ బోర్డు ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీగా మారిస్తే.. ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు. ఒకవేళ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ పేరును మార్చి ఉంటే మాత్రం.. సునిల్ గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడని.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నాడని విమర్శలు చేశాడు.కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు భారత దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ గౌరవార్థం పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించగా.. దీనికి ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)గా నామకరణం చేశారు. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్‌ల పేరు మీదుగా ఇకపై ఈ సిరీస్‌ను నిర్వహిస్తామని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది.అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడుఈ నేపథ్యంలో కర్సన్ ఘవ్రీ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తప్పు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య సిరీస్‌ను ఎల్లప్పుడూ ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీగానే వ్యవహరిస్తారు. టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీని బోర్డుర్- గావస్కర్ ట్రోఫీ అనే పిలుస్తారు.ఒకవేళ ఆసీస్‌తో టీమిండియా సిరీస్‌కు ఈ పేరును గనుక మార్చి ఉంటే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు. అయినా.. ఈసీబీ, ఎంసీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బీసీసీఐ కోరాల్సింది. పటౌడీ పేరు తీసివేయొద్దని గట్టిగా చెప్పాల్సింది.సచిన్ నో చెప్పాల్సిందిసచిన్ టెండుల్కర్ కూడా పేరు మార్పునకు అంగీకరించకుండా ఉండాల్సింది. తను నో చెప్పి ఉంటే బాగుండేది. ఏదేమైనా కనీసం అభ్యంతరం లేవనెత్తకపోవడం సరికాదు’’ అని విమర్శించాడు.‘‘ఏదేమైనా పటౌడీ భారత క్రికెట్లో ఓ దిగ్గజం. ఆయన పేరును తొలగిస్తుంటే మీరెలా ఊరుకున్నారు?’’ అని ఘవ్రీ ప్రశ్నించాడు. ఇక విమర్శల అనంతరం ఈసీబీ విజేత జట్టుకు పటౌడీ మెడల్ ఇస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ మీరు మెడల్స్ ఇవ్వాలని అనుకుంటే.. అందుకోసం ట్రోఫీ పేరునే మార్చాల్సిన అవసరం లేదు కదా!’’ అంటూ ఘవ్రీ ఈసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా గుజరాత్‌కు చెందిన 74 ఏళ్ల కర్సన్ ఘవ్రీ 1974- 1981 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఘవ్రీ.. 39 టెస్టుల్లో 913 పరుగులు, 19 వన్డేల్లో 114 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన ఘవ్రీ టెస్టుల్లో 109, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.2-2తో సమం చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా 2-2తో సిరీస్ సమం చేసింది. ఈ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభించిన శుబ్‌మన్ గిల్ .. 754 పరుగులతో సిరీస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ టూర్లో టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడం హైలైట్‌గా నిలిచింది.చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
'అతడు ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా ఫీలవుతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో'
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.దీంతో భారత టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్‌లను పృథ్వీ షా సంక్లిష్టం చేసుకున్నాడు. ఇక దారుణమైన ప్రదర్శన కనబరిచిన షాపై భారత మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ విమర్శల వర్షం కురిపించాడు. పృథ్వీ షాను తన సహచర ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో పోలుస్తూ ఘావ్రీ చురకలు అంటించాడు. కాగా గిల్, పృథ్వీ షా ఇద్దరూ భారత్ తరపున అండర్-19 ప్రపంచకప్‌లో కలిసి ఆడారు. ఇక గిల్ ఈ ఏడాది ఐపీఎల్లో అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా.. "2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో పృథ్వీ షా, గిల్ భాగంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆడారు. అయితే ఈ రోజు శుబ్‌మన్ గిల్ ఏ స్థితిలో ఉన్నాడు, పృథ్వీ షా ఏ పోజేషన్లో ఉన్నాడు మీరే చూడండి. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. నిరంతరం కష్టపడితేనే ఈ ఫీల్డ్‌లో నిలదొక్కకుంటారు. ఇద్దరు ఒకే వయస్సుకు చెందినవారు. కాబట్టి ఇప్పటికీ అయిపోయింది ఏమీ లేదు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కూడా చాలా లోపాలు ఉండేవి. కానీ గిల్ కష్టపడి వాటిని సరిదిద్దు కున్నాడు. పృథ్వీ షా మాత్రం అలా చేయలేదు. ఇప్పటికీ అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో చాలా లోపాలు ఉన్నాయి. అతడు తను ఎదో పెద్ద స్టార్ క్రికెటర్ అని, తనని ఎవరూ టచ్ చేయలేరని షా అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గాని, రంజీట్రోఫీలో గాని ఏ లీగ్‌లోనైనా మనం ఔట్ కావడానికి ఒక బంతి చాలు అని అతడు గ్రహించాలి. ఈ జెంటిల్మెన్ గేమ్‌లో రాణించాలంటే నిబద్దతతో పాటు క్రమశిక్షణ ఉండాలి అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఘవ్రీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! -
ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
న్యూఢిల్లీ: దేశవాళీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ కు సంబంధించిన సంచలన విషయాలను సౌరాష్ట్ర కోచ్ కర్సన్ గావ్రి వెల్లడించాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్ .. ఇకఫై ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడని, ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ సెలెక్టరే తనతో చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019-20 రంజీ సీజన్లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రను తొలిసారి ఛాంపియన్ గా నిలబెట్టిన 30 ఏళ్ల ఉనద్కత్ పై సెలెక్టర్లు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగివుండటాన్ని ఆయన తప్పు బట్టాడు. వయసును బూచిగా చూపి ఉనద్కత్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోవడమన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (ఒక సీజన్లో) సాధించిన ఆటగాడిని కనీసం భారత 'ఏ' జట్టులోకి కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఉనద్కత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, వాటిపై సెలెక్టర్లు నీళ్లు చల్లేలా ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఉనద్కత్ ను ఎంపిక చేస్తారని తానూ కూడా ఆశగా ఎదురు చూశానన్నాడు. ఉనద్కత్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను 2010లో ఆడాడని, అప్పటి నుంచి జట్టులో స్థానం కోసం కఠోరంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో షమీ, సైనీ, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే -
భారత మాజీ క్రికెటర్ కర్సాన్కు గుండెపోటు
షిమోగా:భారత మాజీ క్రికెటర్ కర్సాన్ ఘావ్రీ(65) గుండె పోటుకు గురయ్యారు. ఆదివారం ఉదయం కర్సాన్ ఆకస్మికంగా గుండె పోటుకు లోను కావడంతో అతన్ని స్థానిక ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డా.పీవీ శెట్టి సోమవారం ధృవీకరించారు. గుండె పోటు వచ్చిన వెంటేనే కర్సాన్ను ఆస్పతికి తరలించి అత్యవసర చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఏంజియోప్లాస్టీ చికిత్స చేసిన తరువాత కర్సాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ అండర్ -19 జట్టుకు కోచ్ గా ఉన్న కర్సాన్.. 1970-80 మధ్య కాలంలో భారత బౌలింగ్ దిగ్గజం కపిల్‌దేవ్‌తో కొత్త బంతిని పంచుకున్నారు. కర్సాన్ 39 టెస్టు మ్యాచ్‌లు, 19 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 109 వికెట్లు తీసిన కర్సాన్.. నాలుగు సార్లు ఐదేసి వికెట్లను సాధించారు.