మహ్మద్‌ సిరాజ్‌ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్‌ యు పప్పా’ అంటూ! | Mohammed Siraj Shares Heartfelt Instagram Story for Late Father After Becoming No 1 Ranked, Goes Viral - Sakshi
Sakshi News home page

Mohammed Siraj Latest Post: మహ్మద్‌ సిరాజ్‌ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్‌ యు పప్పా’ అంటూ!

Sep 21 2023 7:18 AM | Updated on Sep 21 2023 9:33 AM

Miss You Pappa Mohammed Siraj Shares Heartfelt Instagram Story for Late Father After Becoming No 1 Ranked - Sakshi

దుబాయ్‌: ఆసియా కప్‌ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో 694 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం.

వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ టాప్‌గా నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో నంబర్‌వన్‌గా నిలిచిన అతను రెండు నెలల తర్వాత ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌కు ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆసియా కప్‌ ఫైనల్లో 21 పరుగులకే 6 వికెట్లు తీసిన ప్రదర్శనతో ఇప్పుడు మళ్లీ శిఖరానికి చేరాడు.

సిరాజ్‌ తీవ్ర భావోద్వేగం
కెరీర్‌లో అత్యుత్తమ దశను చూస్తున్న సిరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. కొంత కాలం క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ‘మిస్‌ యు పాపా’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫోటోను వారిద్దరు చూస్తున్న చిత్రానికి తాను గ్రౌండ్‌లో ఆడుతున్న ఫోటోను అతను జత చేశాడు.
చదవండి‘నా అకౌంట్‌లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్‌ స్టార్‌ ఆవేదన  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement