
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–13, 15–21, 15–21తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు చేతిలో సింధుకిది 16వ ఓటమి.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు, ప్రణయ్‌లకు 3,712 డాలర్ల (రూ. 2 లక్షల 93 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.