
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ఇవ్వు' అంటూ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కరుణ్ నాయర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన నాయర్.. 77 పరుగులు మాత్రమే చేశాడు.
ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఈ విధర్బ ఆటగాడు.. రీ ఎంట్రీ ఇన్నింగ్స్‌లోనే డౌకటయ్యాడు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ అద్బుతమైన విజయం సాధించినప్పటికి కరుణ్‌నాయర్ ఆటపై మాత్రం సర్వాత్ర విమర్శల వర్షం కురిసింది. దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టుకు అతడిపై ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ వేటు వేస్తుందని అంతా భావించారు.
ఇదే ఆఖరి ఛాన్స్.. ?
కానీ గంభీర్ అండ్ కో కరుణ్ నాయర్‌కు మరో అవకాశమిచ్చారు. లార్డ్స్ టెస్టు భారత తుది జట్టులో నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కీలకమైన మూడో స్దానంలో బ్యాటింగ్ వస్తున్న నాయర్.. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిస్తే అతడికి ఇదే ఫేర్‌వెల్ టెస్టు అయ్యే అవకాశముంది.
ఎందుకంటే జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు వేచిచూస్తున్నారు. సాయిసుదర్శన్ వంటి యువ సంచలనంపై కేవలం ఒక్క మ్యాచ్‌కే టీమ్‌మెనెజ్‌మెంట్ వేటు వేసింది. తొలి టెస్టులో మూడో స్దానంలో ఆడిన సాయిసుదర్శన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి మూడో స్ధానంలో కరుణ్‌కు అవకాశమిచ్చారు. కరుణ్ కూడా ఫెయిల్ అవడంతో సుదర్శన్‌కు మరో అవకాశాన్ని ఇవ్వాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. సుదర్శన్‌తో పాటు బెంగాల్ దేశవాళీ క్రికెట్ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ కూడా జట్టులో చోటు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
రంజీల్లో అదుర్స్..
భారత జట్టులోకి పునరాగమానికి ముందు దేశవాళీ క్రికెట్‌లో నాయర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.
చదవండి: Nitish Kumar Reddy: అతడు ఎందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి ఓవర్‌లోనే అద్భుతం