వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్‌ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.


