ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్‌.. తొలి ఆటగాడిగా..!

Krishna Pandey hit six sixes in an over in Pondicherry T10 League - Sakshi

క్రికెట్‌ చరిత్రలో మరో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌ల రికార్డు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న పాండిచ్చేరి టీ10 లీగ్‌లో పేట్రియాట్స్ యువ ఆటగాడు కృష్ణ పాండే ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది ఈ అరుదైన రికార్డు సాధించాడు. శనివారం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన నితీష్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది పాండే  విధ్వంసం సృష్టించాడు. పాండే కేవలం 19 బంతుల్లోనే 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు సాధించాడు. అయితే ఆనూహ్యంగా  పేట్రియాట్స్ ఈ మ్యాచ్‌లో 4పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  పేట్రియాట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగల్గింది.

ఇక టీ20ల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటిసారిగా ఈ ఫీట్‌ను సాధించాడు. అదే విధంగా శ్రీలంకతో జరగిన టీ20లో వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కిరాన్‌ పొలార్డ్‌ కూడా ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. అయితే టీ10 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా పాండే నిలిచాడు.
చదవండిAttack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top