కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 16 బంతుల్లోనే! వీడియో వైరల్‌ | Kieron Pollard hits 4 100 meter sixes in a row in CPL 2023 | Sakshi
Sakshi News home page

CPL 2023: కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 16 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Aug 28 2023 2:03 PM | Updated on Aug 28 2023 2:55 PM

Kieron Pollard hits 4 100 meter sixes in a row in CPL 2023 - Sakshi

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెయింట్స్‌ కిట్స్‌ బ్యాటర్లలో రుథర్‌ఫర్డ్‌(38 బంతుల్లో 62 నాటౌట్‌) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రావో రెండు వికెట్లు సాధించాడు.

పూరన్‌, పొలార్డ్‌ విధ్వంసం..
ఇక 179 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ ఊదిపడేసింది. 17.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లలో పూరన్‌, పొలార్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో పూరన్‌ 61 పరుగులు చేయగా.. పొలార్డ్‌ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ ఇజారుల్హక్ నవీద్‌కు పొలార్డ్‌ చుక్కలు చూపించాడు. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిGlenn Maxwell Ankle Injury: ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. విధ్వంసకర ఆటగాడు దూరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement