
2025 మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను బార్బడోస్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో ఆ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. యామీ హంటర్ (29), కెప్టెన్ షెమెయిన్ క్యాంప్‌బెల్ (28 నాటౌట్), వాన్ నికెర్క్ (27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బార్బడోస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లెన్ తలో వికెట్ తీశారు.
అనంతరం బరిలోకి దిగిన బార్బడోస్.. 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోట్నీ వెబ్ (31), కైసియా నైట్ (31), చమారీ ఆటపట్టు (25) గెలుపుకు తమవంతు సహకారాన్ని అందించగా.. ఆఖర్లో టీమిండియా ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ (6 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు), ఆలియా అల్లెన్ (9 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి బార్బడోస్‌ను విజయతీరాలకు చేర్చారు.
స్వల్ప స్కోర్‌ను కాపాడుకునేందుకు గయానా బౌలర్లు చాలా కష్టపడినప్పటికీ.. ఆఖర్లో ఆలియా, శ్రేయాంక వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 18 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోగా.. శ్రేయాంక వరుసగా రెండు బౌండరీలు బాది బార్బడోస్ గెలుపును ఖరారు చేసింది.
ఆతర్వాతి ఓవర్‌లో ఆలియా వరుసగా సిక్సర్, బౌండరీ బాది బార్బడోస్ గెలుపును లాంఛనం చేసింది. ఈ టోర్నీలో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాంక, బంతితోనూ (2-0-15-0) పర్వాలేదనిపించింది. 21 ఏళ్ల శ్రేయాంక గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ భారత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది.