అయోధ్య రాముడిని దర్శించుకున్న సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: అయోధ్య రాముడిని దర్శించుకున్న సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌

Published Thu, Mar 21 2024 12:22 PM

 Keshav Maharaj visits Ram Mandir in Ayodhya - Sakshi

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ కేశవ్‌ మహారాజ్‌ తొలిసారి ఐపీఎల్‌లో భాగం కానున్నాడు. ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మహారాజ్‌ ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ.50 లక్షల కనీస ధరకు మహారాజ్‌ను లక్నో సొంతం చేసుకుంది. 

ఇప్పటికే లక్నో జట్టుతో కేశవ్‌ మహారాజ్‌ కలిశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు ప్రస్తుతం లక్నోలోని ఏక్నా స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఆయోద్య రామమందిరాన్ని మహారాజ్‌  గురువారం సందర్శించాడు.

మందిరంలో బాల రాముని విగ్రహాన్ని ఈ ప్రోటీస్‌ స్టార్‌ దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో కేశవ్‌ షేర్‌ చేశాడు. అందుకు క్యాప్షన్‌గా జై శ్రీరామ్‌ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా భారత సంతతికి చెందిన కేశవ్‌ మహారాజ్‌ రామభక్తుడు అన్న సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్‌ సియా రామ్‌’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు.కాగా ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement