ఐదు వికెట్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన విండీస్‌ బౌలర్‌ | Keemo Paul Became-1st-West Indies Bowler Take Two 5-Wkt-Hauls Mens T20Is | Sakshi
Sakshi News home page

IND Vs WI: ఐదు వికెట్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన విండీస్‌ బౌలర్‌

Oct 15 2026 12:12 PM | Updated on Oct 15 2026 12:25 PM

Keemo Paul Became-1st-West Indies Bowler Take Two 5-Wkt-Hauls Mens T20Is

Photo Credit: Twitter

ఉప్ప‌ల్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన నాలుగో టీ20లో టీమిండియా 24 ప‌రుగుల తేడాతో ఓటమి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. టాపార్డ‌ర్ విఫ‌లం కావ‌డం జ‌ట్టు కొంప‌ముంచింది. ఓపెన‌ర్ సామ్స‌న్ రాణించిన‌ప్ప‌టికీ.. అభిషేక్‌, ఇషాన్‌, అయ్య‌ర్‌లు తక్కువ స్కోర్ల‌కే పెవిలియ‌న్ చేర‌డం టీమిండియాపై గ‌ట్టి ప్ర‌భావం చూపించింది. మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌, నితీశ్ కుమార్ రెడ్డిలు రాణించిన‌ప్ప‌టికీ, స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు ఔట్ కావ‌డంతో భార‌త్ ఓట‌మి ఖ‌రారైంది.

ఇదిలా ఉంటే, మ్యాచ్‌లో 41 ప‌రుగులిచ్చి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో టీమిండియా ఓట‌మి కార‌ణ‌మైన కీమో పాల్ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. భార‌త్‌పై టీ20ల్లో కీమో పాల్ న‌మోదు చేసిన ఐదు వికెట్ల హాల్ ఓవ‌రాల్‌గా రెండో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌. 

ఈ జాబితాలో వెస్టిండీస్ బౌల‌ర్‌ ఒబెద్ మెక్‌కాయ్ (6/17, 2022లో బాసెటెర్రే) తొలి స్థానంలో ఉండ‌గా, శ్రీలంక బౌల‌ర్‌ వ‌నిందు హ‌స‌రంగ (4/9, 2021లో కొలంబో వేదిక‌గా), న్యూజిలాండ్ బౌల‌ర్ మిచెల్ సాంట్న‌ర్ (4/11, 2016లో నాగ్‌పూర్ వేదిక‌గా) మూడు, నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

రెండుసార్లు ఐదు వికెట్ల హాల్‌..
అంతేకాదు కీమో పాల్ మ‌రో అరుదైన రికార్డు కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండు ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన తొలి వెస్టిండీస్ క్రికెట‌ర్‌గా కీమో పాల్ నిలిచాడు. 2018లో ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో కీమో పాల్ 15 ప‌రుగులిచ్చి ఐదు వికెట్లు తీయ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా కీమో పాల్ 25 టీ20 మ్యాచ్‌లాడి 31 వికెట్లు ప‌డ‌గొట్టాడు.  

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ షై హోప్‌ (50 బంతుల్లో 102 నాటౌట్‌; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) సిరీస్‌లో రెండో సెంచరీతో చెలరేగగా... షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (26 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (12 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంతరం భారత్‌ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడిపోయింది. సంజు సామ్సన్‌ (23 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... తిలక్‌ వర్మ (25 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (20 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement