World Archery Championships 2023: Jyothi Surekha Enters Quarter Final - Sakshi
Sakshi News home page

World Archery Championship: క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ

Aug 4 2023 10:26 AM | Updated on Aug 4 2023 10:37 AM

Jyothi Surekha Enters Quarter Final In World Archery Championship 2023 - Sakshi

బెర్లిన్‌ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్‌ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

క్వాలిఫయింగ్‌లో రెండో ర్యాంక్‌లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్‌లో 148–145తో ఓ యూహున్‌ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

ధీరజ్‌ పరాజయం 
పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement