Lionel Messi: మెస్సీతో ఇంటర్య్వూ.. జర్నలిస్ట్‌ కన్నీటి పర్యంతం

Journalist Breaks-Down Tears After Meeting Lionel Messi For Interview - Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ దశాబ్దంలో అ‍త్యున్నత ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. మెస్సీని దగ్గరి నుంచి చూసినా చాలానుకుంటారు అతని అభిమానులు. మరి అలాంటిది ఒక వీరాభిమానికి తన ఆరాధ్య దైవాన్ని ఇంటర్య్వూ చేసే అవకాశం వస్తే వదులుకుంటాడా. కచ్చితంగా కాదనడు. మెస్సీని ఇంటర్య్వూ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఒక జర్నలిస్ట్‌ కన్నీటిపర్యంతం అయ్యాడు.

తన ఆరాధ్య దైవం మెస్సీని ఇంటర్య్వూ చేయడం నా జీవత కల అని.. ఇంత తొందరగా ఆ అవకాశం వస్తుందని ఊహించలేదు.. అందుకే ఈ కన్నీళ్లు. థ్యాంక్స్‌ టూ ఆల్‌'' అంటూ సదరు జర్నలిస్ట్‌ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంటర్య్వూలో భాగంగా మెస్సీని చాలా ప్రశ్నలు అడిగాడు. వాటన్నింటికి మెస్సీ ఓపికతో సమాధానమిచ్చాడు.

';'ముఖ్యంగా వచ్చే నెలలో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు ఎలాంటి అవకాశాలున్నాయి''.. ''కెప్టెన్‌గా ఈసారైనా జట్టుకు ట్రోఫీని అందిస్తారా''.. ''మిమ్మల్ని ఇంటర్య్వూ చేయడం నా డ్రీమ్‌'' అన్న ప్రశ్నలు మెస్సీకి ఎదురయ్యాయి. మెస్సీ స్పందిస్తూ.. ''థాంక్యూ.. ఇలాంటి ఇంటర్య్వూలు ఇచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటా. ముఖ్యంగా నన్ను ఆరాధించే నీలాంటి అభిమానులు స్వయంగా ఇంటర్య్వూ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతతో ఉంటా. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో మా జట్టుకు అవకాశాలున్నాయి. శక్తి మేరకు కష్టపడతా. నేనొక్కడిని ఆడితే సరిపోదు.. జట్టు సమిష్టి కృషి కూడా అవసరం'' అంటూ పేర్కొన్నాడు. వీలైతే మీరు ఒకసారి ఇంటర్య్వూ వీడియోపై లుక్కేయండి.

చదవండి: స్టన్నింగ్‌ క్యాచ్‌.. స్ప్రింగులేమైనా ఉన్నాయా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top