Jasprit Bumrah Might Be Rohit Sharmas Deputy For Asia Cup, WC: Reports - Sakshi
Sakshi News home page

Asia Cup: హార్దిక్‌ పాండ్యాకు బిగ్‌షాక్‌.. టీమిండియా కొత్త వైస్‌ కెప్టెన్‌ అతడే!

Aug 20 2023 8:16 AM | Updated on Aug 20 2023 11:02 AM

Jasprit Bumrah Might Be Rohit Sharmas Deputy For Asia Cup, WC: Reports - Sakshi

ఆసియాకప్‌-2023కు భారత జట్టును బీసీసీఐ సోమవారం(ఆగస్టు21) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మెగా ఈవెంట్‌కు జట్టును ఎంపిక చేయనుంది. కాగా మీటింగ్‌లో ఈ  టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పాల్గోనున్నట్లు సమాచారం.

కాగా ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌తో భారత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనట్లు ఏన్సీఐ వర్గాలు వెల్లడించాయి.

హార్దిక్‌పై వేటు.. 
ఇక ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వైస్‌కెప్టెన్‌గా స్టార్‌పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్‌ డిప్యూటీగా ఉన్న హార్దిక్‌పాండ్యాపై వేటువేయనున్నట్లు పలునివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా దృవీకరించాయి.

"ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ డిప్యూటీగా బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉంది. అందుకే ఐర్లాండ్‌ సిరీస్‌లో రుత్‌రాజ్‌ బదులుగా బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చాము. కెప్టెన్సీ సీనియారిటీ పరంగా చూస్తే హార్దిక్‌ కంటే బుమ్రా ముందు వరుసలో ఉన్నాడు. అతడు 2022లో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అదే విధంగా దక్షిణాఫ్రికా వన్డే పర్యటనలో వైస్‌కెప్టెన్‌గా పనిచేశాడని" బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. బుమ్రా ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. ఐరీష్‌తో తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో బుమ్రా కూడా రెండు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
చదవండి: NZ vs UAE: న్యూజిలాండ్‌కు బిగ్‌షా​కిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement