
దశలు.. వేరియెంట్ల వారీగా కరోనా మనుషుల మీద విరుచుకుపడుతోంది. ఇద్దరు దగ్గరగా ఉంటేనే వైరస్ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. అలాంటిది వేల మంది ఆటగాళ్లతో జపాన్ ఎందుకు ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటోంది. మరోవైపు ఒలింపిక్స్ వాయిదా వేయాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఒలింపిక్స్ నిర్వాహణపై సర్వత్రా ఆసక్తితో పాటు ఆందోళన కూడా నెలకొంది.